మఫ్టీలో ఉన్న పోలీసులమని చెప్పి.. గులకరాళ్లు ఇచ్చి.. రూ.5 లక్షల బంగారం దోచుకెళ్లారు

2 months ago 5
Gold Robbery in Mahbubnagar: మహబూబ్‌నగర్‌లో పోలీసులమని చెప్పుకుని ముగ్గురు కేటుగాళ్లు ఓ మహిళను మోసం చేశారు. కరెంట్ బిల్లు కట్టి వస్తున్న ఆమెను అడ్డగించి, దొంగలున్నారని భయపెట్టి, మెడలో ఉన్న బంగారాన్ని గులకరాళ్లతో మార్చి దోచుకెళ్లారు. పట్టపగలే జరిగిన ఈ సంఘటనతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. బంగారం ధరలు పెరగడంతోరోజు రోజుకు ఇలాంటి దొంగతనాలు ఎక్కువవుతున్నాయని తెలుస్తోంది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article