అవయవదానం ప్రతి ఒక్కరూ అవగాహనం పెంచుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. మరణించిన తర్వాత జీవించేందుకు అత్యుత్తమ మార్గం అవయవదానం అని చెప్పారు. ఓ యవకుడు తాను మరణించినా.. మరో ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపగా.. ఆ వార్తను సజ్జనార్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అవయవదానంతో ఎన్నో కుటుంబాల్లో కొత్త వెలుగులు చూడొచ్చునని అన్నారు.