మరింత రుచిగా తిరుమల అన్నప్రసాదం.. మెనూలోకి మసాలా వడ

1 day ago 1
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త వినిపించింది. భక్తులకు అందించే అన్నప్రసాదాలు మరింత రుచికరంగా ఉండేలా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తిరుమల శ్రీవారి అన్నప్రసాదం మెనూలో మరో ఐటమ్ పెంచాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా అన్నప్రసాదం మెనూలో మార్పులు చేయనున్నారు.అన్నప్రసాదం మెనూలోకి మసాలా వడలను చేర్చారు. అయితే ప్రస్తుతం ఇది ట్రయల్ రన్‌ మాత్రమే. సోమవారం ఐదు వేల మసాలా వడలను భక్తులకు వడ్డించారు. ఉల్లిపాయలు, వెల్లులి లేకుండా వీటిని తయారు చేయించారు. మసాలా వడల రుచిపై భక్తుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. పరిశీలనలో లోటుపాట్లను సరిచేసుకొని త్వరలోనే పూర్తిస్థాయిలో అన్నప్రసాదం మెనూలోకి మసాలా వడలు చేర్చనున్నారు.
Read Entire Article