తెలంగాణ ఇంటర్ ఫలితాల వెల్లడికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఫస్ట్ ఇయర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. ఈసారి ఇంటర్ విద్యార్థులు తమ రిజల్స్ట్ చూసుకునేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డు టెక్నాలజీని ఉపయోగించింది. సులువుగా ఫలితాలు చూసుకునేందుకు తొలిసారి వాట్సాప్‌లో కూడా తెలంగాణ ఇంటర్ రిజల్స్ట్‌ను చెక్ చేసుకునేలా ఏర్పాట్లు చేసింది. దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ఇవాళ తమ ఫలితాలను చూసుకోనున్నారు.