GHMC Launches Special Drive For Begger Free City : హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ యాచకుల్లేని నగరంగా మార్చేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. ప్రధాన కూడళ్లలో ఇబ్బంది కలిగిస్తున్న యాచకులను గుర్తించి ఆశ్రయ కేంద్రాలకు తరలిస్తున్నారు. లేదంటే.. కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వందల మందిని గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించి, ఆశ్రయం కల్పించడమే కాకుండా వారిని సమాజంలో తిరిగి కలిపే ప్రయత్నం చేస్తున్నారు. వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.