'మరో చరిత్ర' సినిమాను తలపించే ఘటన హైదరాబాద్‌లో జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్లు ప్రేమించుకుని.. పెద్దల మాట వినకుండా హైదరాబాద్‌లో సహజీవనం చేశారు. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు హైదరాబాద్‌కు వచ్చారు. దీంతో ఇద్దరూ ఒకే గదిలో ఉండటం చూసి షాక్‌కు గురయ్యారు. అనంతరం అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు అమ్మాయిని పోలీసులకు అప్పగించి.. అబ్బాయిని జువైనల్ హోమ్‌కు తరలించారు.