Mlc Anantha Babu Annavaram Temple Video: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మరో వివాదంలో చిక్కుకున్నారు. అన్నవరం సత్యదేవుని ఆలయంలో స్వామివారి కళ్యాణం అనంతరం అక్షింతలు ఆలస్యం కావడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ అధికారులను దుర్భాషలాడారు. 'వాడెవడు.. వాడి పెత్తనం ఏమిటిక్కడ?' అంటూ వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఆయన ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదివరకూ ఆయన దళిత యువకుడి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.