Revanth Reddy Delhi Tour: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మరోసారి హస్తినకు పయనమవుతున్నారు. అయితే.. ఎప్పుడూ ఒంటరిగా వెళ్లే రేవంత్ రెడ్డి.. ఈసారి మాత్రం ఫ్యామిలీతో కలిసి ఢిల్లీకి వెళ్తున్నారు. మొదట ఢిల్లీకి వెళ్లి.. అక్కడి నుంచి జైపూర్‌కు పయనం కానున్నారు. జైపూర్‌లో బంధువుల వివాహ వేడుకకు కుటుంబ సమేతంగా హాజరుకానున్నారు. ఆ కార్యక్రమం తర్వాత.. మళ్లీ ఢిల్లీకి చేరుకుని.. రాజకీయ కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి మునిగిపోనున్నారు. దీంతో.. ఈసారి పర్యటన ప్రాధాన్యత సంతరించుకోనుంది.