ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్‌రాజ్‌లో జరగనున్న మహా కుంభమేళాకు తిరుమల నుంచి శ్రీవారి కల్యాణ రథం బయల్దేరింది. కల్యాణ రథానికి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రత్యేక పూజలు నిర్వహించి రథాన్ని ప్రారంభించారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ కుంభమేళా జరగనుంది. కల్యాణ రథం బయల్దేరిన సందర్భంగా బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ సర్కార్ కేటాయించిన 2.5 ఎకరాల స్థలంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేసినట్లు బీఆర్ నాయుడు తెలిపారు. 170 మంది సిబ్బందితో ఆ ఆలయంలో తిరుమల తరహాలో అన్ని కైంకర్యాలు నిర్వహిస్తామని చెప్పారు.