మహానంది ఆలయం సమీపంలో క్షుద్రపూజలు జరిగాయన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. మహానంది ఆలయం సమీపంలోని గరుడనంది ఆలయం దగ్గర్లోని చెట్ల పొదలలో క్షుద్రపూజలు జరిగినట్లు స్థానికులు చెప్తున్నారు. ఆ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఆలయ అధికారులు స్పందించారు. ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.