ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో మహాశివరాత్రి పర్వదినాన తీవ్ర విషాద ఘటన. ఉదయాన్నే గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లిన ఐదుగురు యువకులు చనిపోయారు. కొవ్వూరుకు సమీపంలోని తాళ్లపూడి మండలం తాడిపూడిలో ఈ ఘటన జరిగింది. ఇవాళ మహాశివరాత్రి కావడంతో బుధవారం ఉదయం ఐదుగురు యువకులు తాడిపూడి వద్ద గోదావరిలో స్నానాలు చేసేందుకు వెళ్లారు. వారంతా నీటిలో కొట్టుకుపోతూ యువకులు కేకలు వేయడంతో స్థానికులు వెంటనే స్పందించారు. గల్లంతైన వారిన కోసం వెతకగా మృతదేహాలు దొరికాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆరా తీశారు. గజ ఈతగాళ్ల సాయంతో మిగిలిన యువకుల కోసం గాలింపు చేపట్టారు. చనిపోయిన యువకులను తిరుమల శెట్టి పవన్, పడాల దుర్గాప్రసాద్, అనిశెట్టి పవన్, గర్రె ఆకాష్, పడాల సాయిగా గుర్తించారు. యువకుల కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.