Tirupati Rapido Rider Misbehaves With Woman: తిరుపతిలో ర్యాపిడో డ్రైవర్ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళ ఇంటికి వెళదామని రైడ్ బుక్ చేసుకున్నారు. అయితే ఇంటికి చేరుకున్న తర్వాత డ్రైవర్ పెద్దయ్య ఈ నీచానికి పాల్పడ్డాడు. మహిళ కేకలు వేయడంతో భర్త, బంధువులు స్పందించి పోలీసులకు అప్పగించారు. డ్రైవర్‌కు కౌన్సిలింగ్ ఇచ్చి, బైండోవర్ చేశారు. మహిళల భద్రతపై పోలీసులు కీలక సూచనలు చేశారు.