ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేయాలంటూ తిరుపతిలో వైసీపీ నేతలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తిరుపతి వైసీపీ ఇంఛార్జి భూమన అభినయ్ రెడ్డి ఆద్వర్యంలో బస్సులో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుంచి పీలేరు వెళ్తున్న పల్లె వెలుగు బస్సు ఎక్కిన మహిళలు.. కండక్టర్ టికెట్ అడిగితే ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చిన చంద్రబాబు వీడియోను ప్రదర్శించారు. అయితే తన విధులకు ఆటంకం కలిగించారంటూ బస్సు కండక్టర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. 35 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది.