ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. ఉద్యోగం చేసే మహిళలు పిల్లల ఆలనాపాలనా చూసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి, పని ప్రదేశాల్లో క్రెష్‌లు (చిన్నారుల సంరక్షణ కేంద్రాలు) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మొదటి దశలో 216 ప్రాంతాల్లో క్రెష్‌లు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎక్కువ మంది మహిళా ఉద్యోగులు ఉన్న కార్యాలయాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఈ నిర్ణయం మహిళా ఉద్యోగులకు ఎంతో ఊరటనిస్తుంది.