రాజమహేంద్రవరం డిపో మేనేజర్ కె.మాధవ డయల్ యువర్ డీఎం కార్యక్రమంలో ప్రయాణికులు సమస్యలపై స్పందించారు. ఈక్రమంలో కుక్కునూరు రూట్‌లో స్త్రీ శక్తి పథకం అమలు, ఛార్జీల సమస్యలపై స్పందించిన ఆయన.. ఆ రూట్లో మహిళలకు ఉచిత ప్రయాణం వర్తించదని తెలిపారు. అలానే వేమగిరి గట్టు, బొబ్బిల్లంక వద్ద బస్సులు ఆగడం లేదన్న వినతులపై స్పందిస్తూ.. సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కొత్త బస్సులు వచ్చాక కొన్ని రూట్లలో సర్వీసులను పునరుద్ధరిస్తామని తెలిపారు. ఆ వివరాలు..