Indira Dairy Programme: కొత్త ఏడాది ప్రారంభంలోనే మహిళా సంఘాలకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. వారి కోసం 'ఇందిరా డెయిరీ ప్రాజెక్టు'ను తీసుకువచ్చింది. దీని ద్వారా మహిళా సంఘాల సభ్యులు ప్రతి నెలా ఆదాయం పొందేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ పథకంలో భాగంగా 70 శాతం సబ్సిడీతో రెండు పాడి గేదెలు/ఆవులు అందిస్తారు. రాష్ట్రంలో పాల కొరత తీర్చడంతో పాటు మహిళా సాధికారత, పాడి పరిశ్రమ అభివృద్ధి లక్ష్యంగా ఈ పథకం ప్రారంభించబోతున్నారు.