కేసీఆర్ కుటుంబ సభ్యులకు వందలాది ఎకరాల భూములు ఉన్నాయంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ అని రేవంత్ రెడ్డి పదే పదే అనే వారని.. ఇప్పుడే ఆయనే కేసీఆర్‌కు 67 ఎకరాలు ఉందని చెబుతున్నారన్నారు. గత మూడేళ్లుగా ఆయన కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ భూస్వామ్య కుటుంబంలో జన్మించారని... చింతమడకలో మా ఇల్లే 2 ఎకరాలు ఉండేదని.. మా తాతకు వందల ఎకరాల భూములు ఉండేవని కేటీఆర్ చెప్పారు. అప్పర్ మానేర్ కారణంగా సొంతూళ్లో ఉన్న భూములు మునిగిపోతే.. వచ్చిన పరిహారంతో మా తాత చింత మండకలో పెద్ద ఎత్తున భూములు కొన్నారని కేటీఆర్ తెలిపారు. రెండెకరాల ఇంటిని కేసీఆర్ ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారన్నారు. తాను అమెరికాలో ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించానని.. మరి రేవంత్ రెడ్డి ఏం చదువుకున్నారని కేటీఆర్ ప్రశ్నించారు.