సెప్టెంబర్ 5వ తేదీ లోపు ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపకపోతే ఉద్యమంలోకి వెళ్తామంటూ ఏపీ జేఏసీ ఛైర్మన్, ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ. విద్యాసాగర్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. 200కు పైగా ఉద్యోగంఘలతో జరిగే రాష్ట్ర జేఏసీ సమామవేశంలో భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ సెప్టెంబర్ 5వ తేదీన ప్రకటిస్తామని చెప్పారు. పీఆర్సీ, ఐదు డీఏలు, సరెండర్ లీవ్‌లు, ఇతర బకాయిలతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై కూడా ప్రభుత్వం స్పందించి వెంటనే చర్చలకు పిలవాలంటూ ఆయన కోరారు.