కొత్త సంవత్సర వేడుకల్లో బాపట్ల జిల్లా వాసులు సరికొత్త రికార్డు సృష్టించారు. కేవలం ఆరు గంటల వ్యవధిలో రూ.6 కోట్ల విలువైన బిర్యానీలను ఆరగించి అందరినీ ఆశ్చర్యపరిచారు. పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ, కొత్త ఏడాదికి ఘన స్వాగతం పలికేందుకు.. భారీ ఎత్తున వేడుకలు నిర్వహించిన ప్రజలు బిర్యానీలతో సంబరాలు చేసుకున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా జిల్లాలో భారీ ఎత్తున కేకులు, బిర్యానీలు, కూల్‌డ్రింకులు, మద్యం అమ్మకాలు జరిగినట్లు స్థానిక వ్యాపారులు తెలిపారు.