Vijaya Sai Reddy Tweet On Bhagavad Gita: మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విచారణకు హాజరుకావాలని సిట్ ఆదేశించగా, ఆయన భగవద్గీతలోని 'కర్మణ్యే వాధికారస్తే' శ్లోకాన్ని ట్వీట్ చేశారు. గతంలోనూ సిట్ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి, తాజాగా మరోసారి పిలవడంతో ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన ఆయనకు సిట్ నోటీసులు జారీ చేయడం గమనార్హం.