Sattenapalli Ysrcp In Charge Gajjala Sudhir Bhargav Reddy: వైఎస్సార్‌సీపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డిని నియమించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు స్థానంలో గజ్జల సుధీర్ బార్గవరెడ్డికి బాధ్యతల్ని అప్పగించారు.