Kodali Nani AIG Hospital: ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. కొడాలి నాని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. అక్కడ పలు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కొడాలి నాని గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కొడాలి నానికి సంబంధించిన హెల్త్ అప్డేట్ తెలియాల్సి ఉంది. కొడాలి నాని ఆరోగ్యంపై వైఎస్సార్‌సీపీ నేతలుకూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.