Balineni Srinivasa Reddy In Janasena Party Joinings Committee: జనసేన పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా అధినేత పవన్ కళ్యాణ్ పార్టీలో చేరికలకు సంబంధించి జాయినింగ్స్ కమిటీని నియమించారు. ఈ కమిటీలో మాజీ మంత్రి బాలినేనికి అవకాశం కల్పించారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలు, డీలిమిటేషన్‌కు సంబంధించిన కమిటీల్లో కూడా ఆయనకు ప్రాధాన్యం ఇచ్చారు. పార్టీలో బాలినేనికి పవన్ కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు.