హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్ కొండాపూర్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అరెస్టు చేసి గచ్చిబౌలి పీఎస్‌కు తరలించారు. కౌశిక్ రెడ్డిపై బంజరాహిల్స్ పీఎస్‌లో బుధవారం కేసు నమోదు కాగా.. ఆయన్ను కలిసేందుకు వెళ్లిన హరీష్‌ను అదుపులోకి తీసుకున్నారు.