Nadendla Bhaskara Rao Health Condition: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు అస్వస్థతకు గురయ్యారంటూ ప్రచారం జరుగుతోంది. ఆయన వృద్ధాప్య సమస్యలతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలొచ్చాయి. ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని.. ఐసీయూలో వైద్యం అందిస్తున్నట్లుగా ఓ ప్రచారం జరిగింది. ఈ క్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ కార్యాలయం స్పందించింది. సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పుకొచ్చారు.