ప్రపంచంలోని టాప్ 100 వేడి నగరాల జాబితాలో ఆదిలాబాద్ 14వ స్థానంలో నిలిచింది. 43.3 డిగ్రీల ఉష్ణోగ్రతతో జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. అటవీ విస్తీర్ణం తగ్గడం, విదర్భ నుంచి వచ్చే వేడి గాలులు ఈ తీవ్రతకు ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లోనూ పలు ప్రాంతాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, రానున్న 24 గంటల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.