హైదరాబాద్‌లో రానున్న నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని.. జలమండలి అక్రమ మోటార్ల వినియోగదారులపై చర్యలు చేపట్టింది. బుధవారం జరిగిన తనిఖీల్లో అత్యధికంగా హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్ డివిజన్‌లో 20 మోటార్లను సీజ్ చేశారు. మొత్తంగా అక్రమంగా నీటిని తోడేస్తున్న వారిపై చర్యల్లో భాగంగా.. 32 మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. అంతే కాదు.. వారి ఇంటికి ట్యాంకర్లు బుక్ కాకుండా.. బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారు. ఇటువంటి చర్యలు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.