ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో టికెట్లు సహా తెలంగాణలోని ప్రముఖ దేవాలయాల్లో దర్శనం, ఇతర సేవలకు సంబంధించిన టికెట్లన్నీ ఈజీగా పొందొచ్చు. అందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా 'మీ టికెట్' మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూర్చున్న చోటు నుంచే టికెట్లు పొందే అవకాశం కల్పించారు.