తెలంగాణలోని డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. స్త్రీనిధి ద్వారా రుణాలు తీసుకుని.. నెలనెలా వాయిదాలు చెల్లించని వారిపై రెవెన్యూ రికవరీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకోనున్నారు. బకాయిలు చెల్లించకపోతే అధికారులకు నేరుగా ఇంటికి వచ్చి భూములు, ఇళ్లు వంటి ఆస్తులను జప్తు చేసి వేలం వేసే అధికారం ఉంటుంది. ఒకవేళ అప్పు తీసుకున్న సభ్యురాలికి ఆస్తులు లేకపోతే.. ఆ బకాయిని చెల్లించే బాధ్యత సంఘంలోని మిగిలిన సభ్యులందరిపై ఉంటుంది. అవసరమైతే అందరి ఆస్తులను జప్తు చేస్తారు. కాబట్టి డ్వాక్రా మహిళలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తమ మొండి బకాయిలను చెల్లించి.. ఆస్తుల జప్తు వంటి చర్యల నుండి రక్షణ పొందాలని అధికారులు సూచిస్తున్నారు.