పాత వాహనాలు ఉన్నవారికి రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పారు. వాటిని తుక్కుగా మారిస్తే రాయితీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ద్విచక్ర వాహనాలకు రూ. వెయ్యి నుంచి 7 వేల వరకు కార్లకు రూ.15 వేల నుంచి 50 వేల వరకు రాయితీ ఇవ్వనున్నారు. గ్రీన్ ట్యాక్స్, జరిమానాల నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. అందుకు సంబంధించి నేడో, రేపో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడనున్నాయి.