జూన్ నెల మధ్యలోకి వచ్చేశాం. మహా అయితే మరో వారం రోజులలో పాఠశాలల తలుపులు తెరుచుకుంటాయి. విద్యార్థుల బడిబాట మొదలవుతుంది. ఇదే సమయంలో కొంతమంది విద్యార్థులు కొత్త స్కూలులోకి అడుగుపెడుతుంటే.. మరికొందరికి పాఠశాలకు వెళ్లటం ఇదే తొలిసారి. ఇలాంటి పరిస్థితులలో పిల్లలను ఎలాంటి పాఠశాలల్లో చేర్పించాలి, ఏ స్కూల్ అయితే మంచిదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. కొంతమంది వేసవి సెలవుల్లోనే తెలుసుకుని ఉంటారు. అయినా కూడా స్కూలులో చేరేముందు ఈ విషయాలను పరిశీలించాలని నిపుణులు చెప్తున్నారు.