మీ బరువు పెరిగితే.. దుస్తుల ధర తగ్గుతుంది.. సంక్రాంతికి సూపర్ ఆఫర్.. ఇదేందిరా అయ్యా!

2 months ago 6
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పండుగల సీజన్ నడుస్తోంది. ప్రజలంతా షాపింగ్ పనుల్లో హడావిడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించేందుకు షాపింగ్ మాల్స్, వస్త్ర దుకాణాలు పలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో ఓ షాపింగ్ మాల్ యాజమాన్యం ఇచ్చిన ఆఫర్.. స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. జీఎల్‌ఆర్‌ షాపింగ్‌ మాల్‌.. కస్టమర్ బరువును అనుసరించి వస్త్రాల మీద డిస్కౌంట్ ఇస్తున్నారు. కస్టమర్ బరువు ప్రకారం అందులో 50 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. దీంతో స్థానికులు ఈ షాపింగ్ మాల్‌కు క్యూ కడుతున్నారు.
Read Entire Article