అక్కినేని కుటుంబం, హీరోయిన్ సమంతపై మంత్రి కొండా సురేఖ అనుచిత కామెంట్స్ చేసిన తెలిసిందే. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో వారి వ్యక్తిగత జీవితాలపై సంచలన కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యల పట్ల నాగార్జున, సమంతతో పాటు సినీ ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేయటంతో కొండా సురేఖ వెనక్కి తగ్గారు. తాను చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు.