మీరాలం చెరువులో వాటర్ స్పోర్ట్స్, ఐ ల్యాండ్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

2 hours ago 1
హైదరాబాద్‌ మీరాలం చెరువు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం ఉదయం ఆకస్మికంగా పరిశీలించారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న సస్పెన్షన్‌ బ్రిడ్జి, ఇతర మౌలిక వసతుల పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను గడువులోగా, నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. చెరువులోకి మురుగునీరు రాకుండా చర్యలు తీసుకోవాలని, మూసీలోకి వరద నీరు వెళ్లేందుకు నాలాను విస్తరించాలని ఆదేశించారు. వాటర్‌ స్పోర్ట్స్‌ కోసం ప్రత్యేక డిజైన్‌, చెరువులోని ఐలాండ్‌ అభివృద్ధి, పర్యాటకులను ఆకర్షించేలా పరిసరాల రూపకల్పనకు సీఎం సూచనలు చేశారు.
Read Entire Article