తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసిన మీర్‌పేట మాధవి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్య జరిగిన ఇంట్లో లభించిన టిష్యూ పేపర్‌పై డీఎన్‌ఏ ఆమెదే అని తేల్చారు. మాధవి పిల్లలతో ఆ డీఎన్‌ఏ మ్యాచ్ అయినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ లీడ్ ఆధారంగా పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. కాగా, ప్రస్తుతం మాధవిని హత్య చేసిన భర్త గురుమూర్తి జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉన్నారు.