హైదరాబాద్‌లో మెట్రో, టీజీఎస్ఆర్టీసీ బస్సులకు కలిపి ప్రవేశపెట్టిన కామన్ ట్రావెల్ పాస్‌పై ప్రయాణికుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నెలవారీ పాస్‌ను రూ.8,500గా నిర్ణయించడంపై ప్రశ్నలు వస్తున్నాయి. రోజువారీ ప్రయాణికులకు ఇది ఉపయోగకరంగా ఉండొచ్చని కొందరు భావిస్తుండగా.. పరిమితంగా మెట్రో వినియోగించే ఉద్యోగులకు సాధారణ టికెట్లు, బస్ పాస్‌లతో పోలిస్తే ఆదా ఎంత ఉంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. ఫీల్డ్ ఉద్యోగులు, మహిళా ప్రయాణికులు, సొంత వాహనదారుల అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.