హైదరాబాద్ మెట్రో మొదటిదశకు రెండోదశను అనుసంధానించే ప్రక్రియలో పాత, కొత్త సాంకేతిక వ్యవస్థల మధ్య సమస్యలు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ముఖ్యమంత్రి సూచన మేరకు హైదరాబాద్ మెట్రోరైలు లిమిటెడ్ డీఎంఆర్‌సీతో సంప్రదింపులు జరుపుతోంది. రెండోదశలోని ఏడు కారిడార్లలో నాలుగు ఇప్పటికే ఉన్న మార్గాలకు కొనసాగింపుగా నిర్మించనున్నారు. ఎంజీబీఎస్–చాంద్రాయణగుట్ట, ఎల్బీనగర్–హయత్‌నగర్, మియాపూర్–పటాన్‌చెరు, రాయదుర్గం–కోకాపేట మార్గాల్లో సాంకేతిక అనుసంధానం కీలకంగా మారింది.