మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మరోసారి తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆకట్టుకున్నారు. కొత్త సంవత్సరం వేళ శుభాకాంక్షలు చెప్తూ బొకేలు, శాలువాలు ఇచ్చే బదులు వాటి స్థానంలో బ్లాంకెట్లు తీసుకురావాలని సూచించారు. చలితో ఇబ్బంది పడుతున్న హాస్టల్ విద్యార్థుల కోసం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆలోచనకు అధికారులు, ప్రజలు అద్భుతంగా స్పందించి వెయ్యికి పైగా దుప్పట్లు అందించారు. తాజాగా కలెక్టర్ రాహుల్ రాజ్ వాటిని విద్యార్థులకు పంచారు.