దేశంలో జరుగుతున్న డీలిమిటేషన్ అంశంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లోక్‌సభ సీట్ల సంఖ్య పెంచకుండా రాష్ట్రాలలోనే అంతర్గత డీలిమిటేషన్ చేపట్టాలని అభిప్రాయపడ్డారు. ఈ విషయం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తుందని.. దీని వల్ల రాజకీయ అస్థిరత ఏర్పడుతుందన్నారు. ప్రతీ రాష్ట్రంలో 33 శాతం రిజర్వేషన్లు.. ఎస్సీ, ఎస్టీ సీట్ల సంఖ్య పెంచడం, రాష్ట్రాల జాబితాలో సమానత్వాన్ని సాధించడం.. అనే అంశాలను కేంద్రం ముందు ఉంచడం చాలా ముఖ్యమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.