ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ అయిన మేడారం జాతర వైభవంగా జరుగుతోంది. లక్షలాది భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం రూ. 3.70 కోట్లు నిధులు మంజూరు చేసింది. మెరుగైన సదుపాయాల కోసమే ఈ నిధులు విడుదల చేసినట్లు తెలిపింది. కాగా, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చొరవతో.. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, గిరిజన వ్యవహారాల శాఖలు సంయుక్తంగా ఈ నిధులు విడుదల చేశాయి.