తెలంగాణలోనూ ‘మొంథా’ తుఫాన్ ప్రభావం కనిపించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈనెల 28న భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే కొమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు.. ఈనెల 29న ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో వర్షాల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.