వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన జ్యోతిష్యుడు వేణుస్వామి.. వెనక్కి తగ్గాడు. తెలంగాణ మహిళా కమిషన్‌కి బహిరంగంగా క్షమాపణ చెప్పారు. హీరో నాగచైతన్య, శోభితా దూళిపాల వివాహం గురించి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు వేణుస్వామి పేర్కొన్నారు. మహిళా కమిషన్‌కు బహిరంగంగా క్షమపణలు తెలిపారు. ఈ సందర్భంగా.. ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం చేయొద్దని వేణుస్వామిని తెలంగాణ మహిళా కమిషన్ హెచ్చరించినట్టు సమాచారం.