Panchayat Polls First Phase Polling: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ నేడు ప్రారంభమైంది. 189 మండలాల్లోని 3,834 సర్పంచ్, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. సాయంత్రానికి విజేతలు ఎవరో తేలనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓటు వేసేందుకు అవకాశం ఉంది. మొత్తం 12,723 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతాయి. ఓటర్లు.. 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.