అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ మే 2న విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోం మంత్రి అనిత సభాస్థలిని పరిశీలించారు. 6 వేల మందితో భద్రత ఏర్పాటు చేసినట్లు అనిత తెలిపారు. రాజధాని రైతులను ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది. వారికి ప్రత్యేక గ్యాలరీలు కేటాయించారు. మధ్యాహ్నం 3:25 గంటలకు ప్రధాని సచివాలయం హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.