Union Minister On Highway Through Amaravati: ఏపీ రాజధానికి కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మరో శుభవార్త చెప్పారు. అమరావతిని తాకుతూ మరో హైవే రాబోతోందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న వినుకొండ-గుంటూరు రెండు లైన్ల మార్గాన్ని నాలుగు లైన్లుగా విస్తరించబోతున్నారు. దీనిని మరో 25 కిలోమీటర్లు పొడిగించి.. అమరావతిని కూడా టచ్ చేయబోతుంది. ఈ హైవే అమరావతికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెప్పారు. మరోవైపు కేంద్రమంత్రి పెమ్మసాని గుంటూరు రైల్వే స్టేషన్‌లో పనుల్ని కూడా పరిశీలించారు.