పశ్చమ గోదావరి జిల్లాలోని భీమవరంలో జులై 2022న నిర్వహించిన అల్లూరి 125వ జయంతి కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ మహిళకు పాదాభివందనం చేశారు. దీంతో ఆమె ఎవరు? ఆమె వెనకాల ఉన్న హిస్టరీ ఏంటి? అనే చర్చ అప్పట్లో జరిగింది. ఆమె ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు కుటుంబానికి చెందిన పసల కృష్ణభారతి. ఆమె కూడా తల్లిదండ్రుల బాటలోనే నడిచి.. గాంధీజీ విలువలతోనే జీవించారు.