మోహన్‌బాబు సెక్యూరిటీ సిబ్బంది అత్యుత్సాహం.. జర్నలిస్టులపై దాడి!

1 month ago 4
మోహన్ బాబు యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. కొంతమంది జర్నలిస్టులపై దాడి చేశారు. ఈ విషయమై తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో పలువురు జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. రంగంపేట సమీపంలోని మోహన్ బాబు యూనివర్సిటీ బయట న్యూస్ కవరేజ్ చేస్తున్న సమయంలో రిపోర్టర్ ఉమాశంకర్, కెమెరామేన్ నరసింహపై బౌన్సర్లు దాడి చేసినట్టు చంద్రగిరి సీఐకి విలేకర్లు ఫిర్యాదు చేశారు. కెమెరాను ధ్వంసం చేశారని.. కెమెరామెన్‌కు గాయాలయ్యాయని సీఐకి జర్నలిస్టులు చెప్పారు. కాగా, ఈ విషయంలో తిరుపతి జిల్లాలోని జర్నలిస్టు సంఘాలు ఆందోళనకు దిగనున్నట్టు తెలుస్తోంది. మంచు ఫ్యామిలీలో తగాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త విషయాలను బయటపెట్టడానికి కొంతమంది జర్నలిస్టులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద న్యూస్ కవరేజ్ చేసేందుకు రిపోర్టర్, కెమేరామెన్ వెళ్లగా సెక్యూరిటీ సిబ్బంది దాడి చేసినట్లు తెలిసింది.
Read Entire Article