యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో వెంకట్రావు తన పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. అనారోగ్య సమస్యల కారణంగానే తాను తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించగా.. ప్రభుత్వం ఆ రాజీనామాను తక్షణమే ఆమోదించింది. అయితే.. ముక్కోటి ఏకాదశి ముగిసిన వెంటనే.. అధ్యయనోత్సవాలు జరుగుతున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక స్థానిక ఎమ్మెల్యేతో ఉన్న విభేదాలే కారణమని ప్రచారం జరుగుతోంది. గత ఏడాది ఆగస్టులో బాధ్యతలు చేపట్టిన ఆయన.. కేవలం నాలుగు నెలల్లోనే తప్పుకున్నారు. ప్రస్తుతం ఆలయంలో ఉత్సవాలు వైభవంగా సాగుతుండగా.. భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రసాదాలు , దర్శన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.