యాదగిరి గుట్ట మండలంలోని ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ కార్మికుడు మృతి చెందగా.. మరో ఏడుగురు కార్మికులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.