యాదాద్రీశుడి సేవలో కల్వకుంట్ల కవిత.. గిరి ప్రదక్షిణలో పాల్గొన్న ఎమ్మెల్సీ

11 hours ago 1
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వైకుంఠ ద్వారం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా నిర్వహించిన గిరి ప్రదక్షిణలో ఆమె పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల కొంగుబంగారంగా యాదాద్రి ఆలయాన్ని.. కేసీఆర్‌ మహాఅద్భుతంగా నిర్మించారని గుర్తు చేశారు. యాదాద్రిని టెంపుల్‌ సిటీ ఆఫ్‌ వరల్డ్‌గా నిలబెట్టుకున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి సూచించారు.
Read Entire Article